Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ పార్టీకి రంగీలా రాం రాం.. ఎందుకో తెలుసా?

Advertiesment
కాంగ్రెస్ పార్టీకి రంగీలా రాం రాం.. ఎందుకో తెలుసా?
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (16:52 IST)
అవును.. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగీలా.. కొద్ది నెలల్లోపే ఆ పార్టీకి స్వస్తి చెప్పేసింది. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించి అందరికీ షాకిచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి కొంత సెలెబ్రిటీ కళ వుంటుందనే నమ్మకాన్ని ఆమె వమ్ము చేశారు. 
 
అంతటితో ఆగలేదు.. కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్తూనే.. ఆ పార్టీపై రంగీలా విమర్శలు చేశారు. పార్టీలో అంతర్గత రాజకీయాలు తారాస్థాయికి చేరాయని.. స్వార్థం కోసం కొందరిని వాడుకుంటున్నారని ఆరోపించారు. 
 
పార్టీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. ఇలాంటి కారణాల వల్లే ఆ పార్టీ బై బై చెప్పేస్తున్నట్లు ఊర్మిళ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రయాన్ 2: నరేంద్ర మోదీ కెమెరాలను చూసే ఇస్రో చీఫ్ శివన్‌ను ఓదార్చారా? (Fact Check)