Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో నేను చెప్పినట్టుగానే ఫలితాలు : సీఎం కేసీఆర్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (19:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతాయని ముందుగానే తాను చెప్పానని ఆవిధంగానే ఫలితాలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో 312 సీట్లు గెలిచిన బీజేపీ ఈ దఫా 255 సీట్లకే పరిమితమైందన్నారు. సీట్ల తగ్గుదల దేనికి సంకేతమే కమలనాథులు ఆలోచన చేసుకోవాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు సంబంధించిన ఒకే దేశం - ఒకే ధాన్య సేకరణ విధానం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్య సేకరణ విషయంలో గతంలో కూడా కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దేశంలో ధాన్యానికి మాత్రమే కనీస మద్దతు ధర ఒక్క ధాన్యానికేనని బియ్యానికి కాదనే విషయాన్ని కేంద్రం గ్రహించాలని సీఎం కేసీఆర్ హితవు పలికారు.
 
పంజాబ్ రాష్ట్రంలో ఓ రీతిలో ధాన్యాన్ని సేకరిస్తున్నారో ఆ విధంగానే తెలంగాణాలో కూడా ధాన్యాన్ని సేకరించాలని కోరుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో పండబోయే యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments