Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు.. పాతవారికే టిక్కెట్లు : సీఎం కేసీఆర్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (19:15 IST)
తెరాస విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని తెరాస భవన్‌లో జరిగింది. ఇందులో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఎన్నికలు పాతవారికే టిక్కెట్లు ఇస్తామని తెలిపారు. అయితే, విజయం కోసం ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. అదేసమయంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. 
 
ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న రాజకీయాలను నిలువరించేందుకు గట్టిగానే ప్రయత్నం చేయాలని కోరారు. ముఖ్యంగా, తెరాసను బీజేపీ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అందువల్ల బీజేపీ నేతలు ఒక మాట అంటే మనం పది మాటలు అనేలా పార్టీ నేతలు ఉండాలని పిలుపునిచ్చారు. అదేసమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొవద్దని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 
 
పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా తన కుమార్తెనే పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు అడిగారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీజేపీ, వైకాపా బంధాన్ని కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. బీజేపీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయని అన్నారు. 
 
ఒకవైపు తమకు అనుకూలంగా ఉన్న జగన్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments