తెలంగాణ సీఎం కేసీఆర్ మునుగోడులో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం తర్వాత ప్రజల మధ్యకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన భారీ బహిరంగ సభలో విరుచుకుపడతారని సమాచారం. ఫామ్‌హౌస్ ఘటనలో అందరికీ తెలియని కొన్ని నిజాలను, కోణాలను సీఎం కేసీఆర్ బయటపెడతారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టిన సీఎం కేసీఆర్.. ఫామ్‌హౌస్ డీల్‌ను నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లి జాతీయ స్థాయిలో బీజేపీని ఇరుకునపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఫామ్‌హౌస్ డీల్‌పై మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతోనూ ఈ డీల్‌పై చర్చించారు. మరోవైపు పోలీసులు కూడా సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.