బోరు బావిలో పడిన చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 28 మే 2020 (08:10 IST)
మెదక్‌ జిల్లాలో బోరు బావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్‌ మృతిచెందాడు. దాదాపు 17 అడుగుల లోతులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. రెస్క్యూ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు.

అయితే అప్పటికే చిన్నారి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం బోరు వేసిన అరగంటకే మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్‌ బోరుబావిలో పడ్డాడు. పాపన్న పేట మండలంలో సాగుకోసం పంటపొలంలో బోరు వేశారు. అయితే వెంటనే కేసింగ్‌ ఏర్పాటు చేయలేదు.

దీంతో ఆటలాడుకుంటున్న మూడేళ్లచిన్నారి సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

బాలుడిని వీలైనంత త్వరగా బావి నుండి బయటకు తీసేందుకు యత్నించారు. దాదాపు 12 గంటలపాటు రెస్క్యూ నిర్వహించి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మన్నీరు అయ్యారు. ఆ గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. స్థానికులందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments