కేసీఆర్ రిటైర్ కాకుంటే.. కేటీఆరే వెన్నుపోటు పొడుస్తాడు.. అరవింద్

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (17:08 IST)
టీఆర్ఎస్ పార్టీ పై నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికలపై ప్రస్తావిస్తూ.. బీజేపీ విజయంతో తెరాస పార్టీలో లుకలుకలు ఏర్పడుతాయని..  స్వయంగా ఆయన కొడుకు కేటీఆరే వెన్నుపోటు పొడుస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ప్రజలను,  ఓట్లను కొనుక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిదని, హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా… ప్రజలు తిరస్కరించారని తెలిపారు. అవినీతి, అహంకారం టీఆర్ఎస్ పార్టీ పతనావస్థకు దారి తీస్తున్నదని హెచ్చరించారు.  కేసీఆర్ శకం ముగిసిందని.. త్వరలో ఆయన రిటైర్ కావాలని లేకపోలే ప్రజలే ఆ పని చేస్తారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అరవింద్ అన్నారు. బంగారు తెలంగాణ బీజేపీ, మోదీ నాయకత్వంతోనే సాధ్యం అని ఆయన స్పష్టం చేశారు. 
 
దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ గెలుపుతో తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతుందని అరవింద్ అన్నారు. తెలంగాణలో గత ఏడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో అనేక మంది బీజేపీలో చేరబోతున్నారని జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments