Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు : భారీ మెజార్టీ దిశగా వైకాపా

Advertiesment
Badvel By Election Results 2021 Live
, మంగళవారం, 2 నవంబరు 2021 (10:29 IST)
క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. మూడో రౌండ్ ముగిసేస‌రికి వైసీపీ 23,754 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో వైకాపాకు 10,478, బీజేపీకి 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు వ‌చ్చాయి. అంత‌కుముందు లెక్కించిన పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ వైసీపీ ఆధిక్యం క‌న‌బ‌రిచింది. 
 
కాగా, గత నెల 30వ తేదీన జరిగిన ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా… వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్‌ జండర్‌ 22 మంది ఉన్నారు. 
 
2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. అప్పుడు 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్ ధరల్లో పెరుగుదలేగానీ తగ్గుదల కనిపించదే.... జనం గగ్గోలు...