Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హుజురాబాద్‌ బైపోల్ హోరాహోరీ : గెలుపుపై ఆ 4 సర్వేల్లో ఒకటే ఫలితం!

హుజురాబాద్‌ బైపోల్ హోరాహోరీ : గెలుపుపై ఆ 4 సర్వేల్లో ఒకటే ఫలితం!
, ఆదివారం, 31 అక్టోబరు 2021 (11:20 IST)
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ శనివారం జరిగింది. నవంబరు రెండో తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే, ఈ ఉప పోరు అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరోహారీగా సాగింది. 
 
ముఖ్యంగా, ఆది నుంచి ఈ ఉప పోరు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌గానే సాగింది. ఇక ఎన్నిక సమయంలో కూడా అదే రుజువైంది. అసలు హుజూరాబాద్ ప్రజలు పార్టీని చూడలేదు…అయితే కేసీఆర్ వైపు లేదంటే ఈటల వైపుకు వెళ్ళిపోయారు. అంటే కేసీఆర్ వైపు ఉంటే టీఆర్ఎస్‌కు, ఈటల వైపు ఉంటే బీజేపీకి ఓట్లు గుద్దేశారు.
 
అయితే హుజూరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి వచ్చి సరికొత్త రికార్డుని సృష్టించారు. గత ఎన్నికలు అంటే 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84 శాతం పోలింగ్ నమోదైంది. కానీ ఈ సారి దాని కంటే ఎక్కువగా అంటే 86.57 శాతం పోలింగ్ నమోదైంది. 
 
అంటే హుజూరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి ఎంత ఆసక్తి చూపించారో అర్ధమవుతుంది. మరి ఓటింగ్ ముగిసింది… ఇక ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారనే అంశంపై కూడా దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది.
 
పోలింగ్ ముగియగానే వరుసపెట్టి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్… వన్ సైడ్‌గా మాత్రం లేవు. కొన్ని ఏమో టీఆర్ఎస్ గెలుస్తుందని చెబితే, కొన్ని బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. కానీ వీరి మధ్య ఎక్కువ ఓట్ల శాతం తేడా ఉండదని కూడా చెప్పాయి. అంటే ఎవరు గెలిచిన తక్కువ మెజారిటీలతో బయటపడతారని అర్ధమవుతుంది.
 
కాకపోతే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌ ఈటల గెలుస్తారని క్లారిటీ ఇచ్చేశాయి. అంటే కారు పార్టీ కంటే ఈటలకే ఎక్కువ ఓట్లు వస్తాయని తేల్చాశాయి. కాకపోతే గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో ఈటల ఇమేజ్‌ పనిచేసిందని చెబుతున్నారు. 
 
నియోజకవర్గంలో గత శాసనభ్యుడిగా ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రజలకు సేవాభావంతో సహకరించడం వంటి అంశాలతోపాటు మంత్రివర్గం నుంచి తొలగించిన సానుభూతి పనిచేసినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.100 కోసం చిన్నారి ప్రాణాలు తీసిన వార్డుబాయ్... ఎక్కడ?