Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హుజురాబాద్ బైపోల్ : ఈటెల రాజేందర్ కోసం అమిత్

Advertiesment
హుజురాబాద్ బైపోల్ : ఈటెల రాజేందర్ కోసం అమిత్
, బుధవారం, 13 అక్టోబరు 2021 (09:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయం సమీపిస్తుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. 
 
కాగా, నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు తెరాస, బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు స్టార్ క్యాంపెయినర్‌లను ప్రకటించాయి. 
 
అయితే హుజురాబాద్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా రంగంలోకి దించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈటెల కోసమే ఆయన ప్రచారానికి వస్తున్నట్టు సమాచారం. 
 
తెరాసకు ధీటుగా ఈ ఎన్నికలను తీసుకున్న బీజేపీ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా తో ఓ భారీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం భారీ బహిరంగ సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తుంది. 
 
ఇదిలావుంటే, అమిత్ షా తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి అయినా ఇతర సందర్భాల్లోనూ అమిత్ షా భారీ సభలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా పండగ పూట వంటిల్లో ధరల మంట