Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హుజురాబాద్ బై పోల్ : ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

హుజురాబాద్ బై పోల్ : ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
, శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. దీంతో ఆ రోజు రాత్రి 7.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 
 
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రచురించరాదని, ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు. ఆదేశాలు అతిక్రమించచి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా, మీడియాలో ప్రచురించినా శిక్ష తప్పదని  కర్ణన్ హెచ్చరించారు.
 
కాగా, తెరాస సీనియర్ నేతగాను, మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఆ పార్టీతో పాటు.. మంత్రిపదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజాపూర్ అడవుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ మృతి