హాస్టలుకి తీసికెళ్లమని స్నేహితుడికి ఫోన్ చేస్తే అడవికి తీసుకెళ్లాడు, ఆ తర్వాత...

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (17:02 IST)
తనతో పాటు చదువుకున్న వ్యక్తి. మంచివాడు. స్నేహితుడు కదా అని నమ్మింది. తల్లిదండ్రులతో పాటు సమానంగా స్నేహితుడికి గౌరవమిచ్చేది. అదే ఆమె పాలిట శాపంగా మారుతుందని ఊహించలేదు అభాగ్యురాలు. నమ్మి స్నేహితుడికి ఫోన్ చేసి హాస్టల్‌కు తీసుకెళ్ళమన్నందుకు అతడిలో కామాంధుడిని చూపించాడు. పలుమార్లు అత్యాచారం చేసి నడిరోడ్డుపైనే వదిలివెళ్ళిపోయాడు. 

 
పంజాబ్ లోని మోహాలిజిల్లాలోని జిరాక్ పూర్‌లో ఉంటోంది 22 యేళ్ళ యువతి. హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తోంది. తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి రెండురోజుల క్రితం రాత్రి వేళలో జిరాక్ పూర్‌కు 15 కిలో మీటర్ల దూరంలోని ప్రాంతానికి చేరుకుంది. హాస్టల్‌కు వెళ్ళాల్సి ఉండగా స్నేహితుడు కుష్వీందర్ భటిండాకు ఫోన్ చేసింది. 

 
రాత్రి వేళలో వచ్చిన అతను కారులో యువతిని ఎక్కించుకున్నాడు. మామూలుగా వెళ్ళే రూట్‌లో కాకుండా వేరొక రూట్లోకి కారును మళ్ళించాడు. స్నేహితుడని నమ్మినందుకు భటిండా ఆ యువతిని మోసం చేశాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో కారును నిలిపాడు. తన వద్ద తెచ్చుకున్న కత్తిని చూపించి యువతిని బెదిరించాడు.

 
తనకు లొంగిపోవాలని లేకుంటే చంపేస్తానన్నాడు. అయినా ఆ యువతి ప్రతిఘటించింది. దీంతో ఆమెను అత్యంత క్రూరంగా మర్మాంగాలపై దాడి చేసి పలుమార్లు అత్యాచారం జరిపాడు. ఆ చిమ్మచీకటిలో ఆమెను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎలాగోలా అక్కడి నుంచి వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments