Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫారెస్ట్ మ్యాన్ గా జగపతిబాబు- కెసిఆర్ నిర్ణ‌యం బాగుంది

ఫారెస్ట్ మ్యాన్ గా జగపతిబాబు- కెసిఆర్ నిర్ణ‌యం బాగుంది
, శనివారం, 9 అక్టోబరు 2021 (19:45 IST)
Jagapathibabu, Santosh Kumar and others
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గ్రీన్ ఫండ్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని జగపతిబాబు అన్నారు. పచ్చదనం పెంపును ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్ ఫండ్ కల్పిస్తుందని ఆయన అన్నారు.  
 
దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరుగుతున్న సింబా – ద ఫారెస్ట్ మ్యాన్ షూటింగ్ లో జగపతిబాబు పాల్గొన్నారు. మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం అనే నినాదంతో ఈ చిత్రం రూపొందుతోంది.  అడవులు, పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు అటవీ అధికారి పాత్ర పోషిస్తున్నారు.  
 
డైరెక్టర్ సంపత్ నంది, మిగతా యూనిట్ సభ్యులు  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎం.పీ. జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి జగపతిబాబు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు  చాలా బాగున్నాయని,  అదే సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంపీ సంతోష్ కుమార్ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని ఈ సందర్భంగా జగపతి బాబు అన్నారు. అన్ని వర్గాలను గ్రీన్ ఇండియాలో భాగస్వామ్యం చేయటం సంతోషంగా ఉందన్నారు.  ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ పీ.వీ. రాజారావు, దర్శకుడు సంపత్ నంది, నిర్మాతలు రాజేందర్ రెడ్డి, మురళీ మనోహర్ రెడ్డి,  యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి, హీరోయిన్ దివి వధ్వ, ప్రతి నాయకుడు కబీర్ దుహన్ సింగ్, చిత్ర యూనిట్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 
 
అంతకు మందు ఫారెస్ట్ అకాడమీకి తొలిసారి వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ కు డైరెక్టర్ పీవీ.రాజారావు స్వాగతం పలికారు.  దూలపల్లిలో ఉన్న తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ప్రత్యేకతను వివరించారు. తెలంగాణతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి ఫారెస్ట్ సర్వీసుకు ఎంపికైన వారికి అకాడెమీలో ఉత్తమ శిక్షణ లభిస్తుందని వెల్లడించారు. ఫారెస్ట్ అకాడెమీ అధికారులు, సిబ్బందితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిబి సత్యరాజ్ నటిస్తున్న 'మాయోన్' టీజర్ విడుదల