ఒక్క చలానా పెండింగ్‌... బండి సీజ్.. ఎక్కడంటే?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (12:44 IST)
హైదరాబాద్ జీహెచ్ఎంసి పరిధిలోనే గత ఆరునెలల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇక జరిమానా, చలనాలతో ఖజానాలో కాసుల వర్షం కురుస్తుంది. ఇక గత నెల రోజుల నుంచి హైదరాబాద్ పోలీసులు పెండింగ్‌‌ ట్రాఫిక్ ఫైన్లు వసూలు చేసేందుకు స్పెషల్‌‌ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లాక్‌‌డౌన్ కేసులతో పాటు ట్రాఫిక్ రూల్స్‌‌ బ్రేక్ చేసిన వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. 
 
తాజాగా ఒక్క చలానా పెండింగ్‌ ఉందని మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశారు. కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్‌ తొగరి బైకును ఆదివారం పర్వత్‌నగర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. 
 
ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని ఎస్‌ఐ మహేంద్రనాథ్‌ కోరారు. అది తప్పుడు చలానా అని న్యాయవాది బదులిచ్చారు. బండిని సీజ్‌ చేయగా, ఒక్క చలానాకే ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. మాదాపూర్‌ ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఒక్క చలానా పెండింగ్‌ ఉన్నా సీజ్‌ చేయొచ్చని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments