హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు రూ.20 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి నుంచి వచ్చిన వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ విలియమ్స్‌ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, ఇటీవలి కాలంలో ఈ విమానాశ్రయంలో డ్రగ్స్‌ను భారీగా స్వాధీనం చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఇప్పటికే, హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు.. సినీ ఇండస్ట్రీలో అనేకమంది డ్రగ్స్ బానిసలైనట్టు వార్తలు వస్తున్నాయి. వీరికి సరఫరా చేసేందుకే భారీ మొత్తంలో డ్రగ్స్‌ను హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే, గతంలోనూ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం జరిగిన ఘటనలు ఉన్నాయి. విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ను ఎయిర్‌పోర్ట్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ పట్టివేతపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. ఆహార పదార్థాల్లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగు చూసింది.
ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు ఆహార సామగ్రిలో పేరుతో డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. కిలోకుపైగా మెథమెటమిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలతో కలిపి తీసుకునే మాదక ద్రవ్యంగా దీన్ని గుర్తించారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో పలు శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు.