భారత రాష్ట్ర సమితిలో విలీనమైన భూమి పుత్ర సంఘటన పార్టీ

Webdunia
సోమవారం, 8 మే 2023 (10:16 IST)
మహారాష్ట్రలోని చిన్న రాజకీయ పార్టీల్లో ఒకటైన భూమిపుత్ర సంఘటన పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో విలీనం చేశారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీపీఎస్ సంస్థాపక అధ్యక్షుడు సంతోష్ వాడేకర్ తన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ సక్షమంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆయనతో పాటు పార్టీ నేతలు కిరణ్ వాబాలే, అనినాశ్ దేశ్‌ముఖ్, అశోక్ అందాలే, రాజన్ రోక్డే, అసిఫ్ భాయ్ షేక్ తదితరులు బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. 
 
వీరితో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు సైతం సీఎం సమక్షంలో భారాసలో చేరగా.. వారికి కేసీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ నేత సమాధాన్‌ అర్నికొండ, ఆప్‌ పార్టీ నేత దీపక్‌ కొంపెల్వార్‌, యోగితా కొంపెల్వార్‌, రాము చౌహాన్‌, భారీ త్రిలోక్‌ జైన్‌, సంతోష్‌ కాంబ్లేలు భారాసలో చేరారు. 
 
అఖిల భారతీయ క్రాంతి దళ్‌ సంఘటన నేత లక్ష్మీకాంత్‌, గణేశ్‌, సంతోష్‌ గౌర్‌ల ఆధ్వర్యంలో గంగాధర్‌ మహారాజ్‌ కురుంద్కర్‌, గణేశ్‌ మహారాజ్‌ జాదవ్‌లు భారాసలో చేరారు. నిఖిల్‌ దేశ్‌ముఖ్‌ ఆధ్వర్యంలో గోండ్వానా పార్టీకి విదర్భ అధ్యక్షులు ప్రణీత వికేసీ, యావత్మాల్‌కు చెందిన సామాజిక కార్యకర్త వర్ష కాంబ్లే, విదర్భకు చెందిన మహిళా బచత్‌ గాట్‌ మహిళా కమిటీ అధ్యక్షురాలు కల్పన, పూనమ్‌ అలోర్‌లు భారాసలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments