Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దొంగ ముద్రవేసి... సొంత ఉద్యోగిని కొట్టి చంపేశారు...

Advertiesment
man beaten
, గురువారం, 13 ఏప్రియల్ 2023 (17:56 IST)
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. దొంగ అని ముద్ర వేసి ఉద్యోగిని సహచర ఉద్యోగులంతా కలిసి కొట్టి చంపేశారు. యూపీలోని షాజహాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. 
 
బంకిం సూరి అనే వ్యక్తి కొన్నేళ్లుగా రవాణా వ్యాపారం చేస్తున్నారు. ఈయన వద్ద శివమ్ జోహ్రీ అనే 32 యేళ్ళ వ్యక్తి ఏడేళ్లుగా మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ వ్యాపారి కొన్ని వస్తువులను వేరే ట్రాన్స్‌పోర్టు చేరవేశాడు. అయితే, వీటిలో కొన్ని వస్తువులు కనిపించకుండా పోగాయి. దీంతో ఆగ్రహానికి గురైన సూరి అనుమానంతో ట్రాన్స్‌పోర్టులో పని చేసే ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు. వ్యాపారి మాట మేరకు అతని మనుషులు శివమ్ స్తంభానికి కట్టేసి ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టారు. ఈ దెబ్బలకు తట్టుకోలేక అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆ తర్వాత ఆయన మృతదేహాన్ని షాజహాన్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి బయట పడేసి వెళ్లిపోయారు. మృతదేహాంపై ఉన్నగాయాలను పరిశీలించిన పోలీసులు హత్య ఘటనగా అనుమానించారు. ఈ క్రమంలోనే శివమ్‌ను రాడ్డుతో చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ఆధారంగా బంకిం సూరి, వేరొక ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని అయిన నీరజ్‌ గుప్తాతో సహా మరో ఐదుగురిని నిందితులుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న చందంగా ఉంది.. ఎమ్మెల్సీ కె.కవిత