భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభించింది. రోజూ ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో భారతదేశం అంతటా 5,676 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 37,093కి పెరిగింది.
విమానాశ్రయాలు- రైల్వే స్టేషన్‌లతో సహా అనేక ప్రాంతాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అవుతోంది.