Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు - 15 మరణాలు

coronavirus
, మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (11:30 IST)
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5676 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి 15 మంది చనిపోయారు. సుధీర్ఘ కాలం తర్వాత ఏకంగా ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 5676 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 37093 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా కేరళలో 13745, మహారాష్ట్రలో 4667, ఢిల్లీలో 2336, తమిళనాడులో 2099, గుజరాత్‌లో 1932, హర్యానాలో 1928, కర్నాటకలో 1673, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 1282 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక మిగిలిన ఇతర రాష్ట్రాల్లో వెయ్యికి లోపు పాజిటివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
అదేవిధంగా ఈ వైరస్ బారినపడిన వారిలో 4,42,00,079 మంది కోలుకోగా, 24 గంటల వ్యధిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ముగ్గురు చొప్పున, కేరళలో ఇద్దరు, గుజరాత్‌, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది చనిపోయారు. వీటితో కలుపుకుని మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,31,000కి చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెల్ఫీ కావాలంటే.. రూ.500 చెల్లించాలి.. మంత్రి కేటీఆర్ సరదా వ్యాఖ్యలు