దేశంలో కరోనా వైరస్ మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. గత 24 గంటల్లో ఏకంగా 1071 పాజటివ్ కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గత 129 రోజుల తర్వాత ఈ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు, ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5915 క్రియాశీలక కేసులు ఉన్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో రెండు హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదే విషయంపై ఒక మీడియా బులిటెన్‌ను విడుదలచేసింది. ఇందులో గత 24 గంటల్లో 1071 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. మూడు రాష్ట్రాల్లో ఒక్కరు చనిపోగా, వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 5,30,802కు చేరుకుందదని తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుమికూడిన ప్రాంతాలకు వెళ్లేవారు మాస్కులు ధరించి వెళితే మంచిదని వైద్యశాఖ అధికారులు తెలిపారు.