Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ సేవల యాక్టివ్ పేరుతో సైబర్ నేరగాళ్ల దందా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (09:53 IST)
ఈ నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించాయి. రిలయన్స్ జియో మూడు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్ టెల్ మాత్రం దేశంలోని ఏడు నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
 
అయితే, ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. 5జీ సేవల యాక్టివేషన్ పేరుతో ఫోన్లను హ్యాక్ చేస్తూ, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన తెలంగాణ పోలీసులు.. ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఒక అవగాహన వీడియోను షేర్ చేసింది. 
 
మీ మొబైల్‌ సిమ్ కార్డ్‌లో 5జీ సేవలను యాక్టివేట్ చేశారనే తప్పుడు సాకుతో సైబర్ నేరగాళ్లతో ఓటీపీలను ఎలా షేర్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారో ఈ వీడియోలో వివరించారు. 
 
'5జీ అప్‌గ్రేడేషన్ సిమ్ స్కామ్ పట్ల జాగ్రత్త వహించండి. మీ సిమ్‌లను అప్‌గ్రేడ్ చేస్తామనే సాకుతో మిమ్మల్ని మోసగించే సైబర్ మోసగాళ్ల బారిన పడకండి. మనీ పర్స్ వీడియో ప్రకారం, సైబర్ నేరగాళ్లు కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు 5G సేవలకు మారడానికి అర్హులని, ఇది ఉచితం అని మీకు తెలియజేస్తారు. అప్పుడు వారు సేవలను సక్రియం చేయడంలో సహాయపడే ఓటీపీ  కోసం మిమ్మల్ని అడుగుతారు.
 
మీ మొబైల్‌కు ఓటీపీ పంపించి, దాన్ని తమకు చెప్పాలని అడుగుతారు. ఆ ఓటీపీని షేర్ చేయగానే ఫోన్‌ను హ్యాక్ చేసి అందులోని వ్యక్తిగత డేటాతో పాటు ఇతర వివరాలను తస్కరించడమే కాకుండా బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కాజేస్తారు' అందువల్ల 5జీ సేవల యాక్టివేషన్ పేరుతో వచ్చే మెసేజ్‌లపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments