Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపు: 170 మంది ముందస్తుగా అరెస్ట్

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (15:34 IST)
బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. సోమవారం బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్‌లో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దించారు. ఈ సందర్భంగా సీపీ నాగారాజు మాట్లాడుతూ.. బోధన్ లో ప్రశాంతంగా బంద్‌ కొనసాగుతోందన్నారు.
 
నిన్నటి ఆందోళనకు సంబంధించి 10 మంది అరెస్ట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో 170 మందిని ముందస్తు అరెస్ట్ చేశామని, బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోందని ఆయన వివరించారు. 
 
నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శివసేన, బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. 
 
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి, టీయర్ గ్యాస్ ను కూడా వదిలారు. దీంతో ఆందోళన కారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. నిన్నటి ఘటనలో అరెస్ట్ అయిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోద చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments