Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం: హైదరాబాద్ సీపీ సజ్జనార్

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (09:23 IST)
హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు సీపీ సజ్జనార్‌ ప్రకటించారు. ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా అన్నిరకాల వేడుకలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్‌కి పబ్లిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు. రిసార్ట్స్‌, పబ్‌లపై నిఘా ఉంటుందని.. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదని.. హద్దు మీరితే ఉపేక్షించామన్నారు. స్టార్‌ హోటల్స్‌లో రోజువారీ కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 31వ తేదీన డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయని చెప్పారు. సైబరాబాద్‌ పరిధిలో ఎలాంటి ఈవెంట్లకు అనుమతి లేదని వివరించారు. గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోనూ అనుమతి లేదని సజ్జనార్‌ పేర్కొన్నారు.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సహకరించాలని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments