Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంచికచర్లలో బంద్ ప్రశాంతం

Advertiesment
కంచికచర్లలో బంద్ ప్రశాంతం
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (16:53 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన భారత్ బంద్లో భాగంగా మంగళవారం కంచికచర్లలో సిపిఎం సిఐటియు ప్రజాసంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది.

బందులో పలు కార్మిక సంఘాలతో పాటు లారీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద నుండి నాయకులు కార్మికులు రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, నరేంద్రమోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై ప్రదర్శన చేశారు. చెవిటికల్లు రోడ్డు సెంటర్ బంకు సెంటర్ నెహ్రూ సెంటర్ మధిర రోడ్డులో ప్రదర్శన సాగింది.

రైతులకు మద్దతుగా చేపట్టిన బంద్ కు కంచికచర్లలో అన్ని వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి రైతాంగ వ్యతిరేక చట్టాలు యాక్ట్ 2020  20 చట్టాలను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి జి హరికృష్ణ రెడ్డి నాయకులు లంకోజి నాగమల్లేశ్వరరావు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం సోమేశ్వర రావు యుటిఎఫ్ నాయకులు నాగేశ్వరరావు సిఐటియు నాయకులు బెజ్జం భూషణం కాశిబోయిన రాంబాబు బడేటి దాసు కంభంపాటి శ్రీను అమర్లపూడి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టారు రవి దేవరకొండ శ్రీను జయరాజు లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పెద్దమల్ల భద్రయ్య కార్యవర్గ సభ్యులు రామారావు తాటికొండ వీరయ్య పోలిశెట్టి శ్రీను పంచాయితీ, బిల్డింగ్,ఆశ,ఆటో, ముఠా మరోయి వివిధ రంగాల కార్మికులు బంద్ లో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో ఒకడ్రామా, గల్లీలో ఒకడ్రామా : వైసీపీపై టీడీపీ ఫైర్