Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం

Advertiesment
భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం
, సోమవారం, 7 డిశెంబరు 2020 (23:49 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు దీక్ష చేపట్టిన విషయం విదితమే. రైతన్న దీక్షకు మోదీ సర్కార్ దిగిరాకపోవడంతో.. రైతులపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 8న (బుధవారం) రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

నిన్న మొన్నటి వరకూ ఈ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం.. రేపు బంద్ అనగా.. ఇవాళ సాయంత్రం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 
 
భారత్‌ బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బంద్ సందర్భంగా రేపు ఏపీలో విద్యా సంస్థలు బంద్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఒంటి గంట తర్వాతనే ప్రభుత్వ కార్యాలయాలను తెరవాలని ఆదేశించింది. ఏపీలో ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపొద్దని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. బంద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలసేకరణ సంస్థలను జగన్ నాశనం చేస్తున్నాడు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి