Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాలసేకరణ సంస్థలను జగన్ నాశనం చేస్తున్నాడు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

Advertiesment
Jagan
, సోమవారం, 7 డిశెంబరు 2020 (23:45 IST)
రాష్ట్రంలో రైతులపరిస్థితి అగమ్యగోచరంగాఉంటే, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, పాలకుల తీరుతో రైతాంగం దిక్కుతోచనిస్థితిలో ఆకాశంవైపుచూస్తోందని, టీడీపీనేత, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వాపోయారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అతివృష్టి, వరదలకారణంగా నష్టపోయినరైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, బాధ్యతనుంచి తప్పించుకోవాలని చూస్తుంటే, ముఖ్యమంత్రి మాట్లాడినప్రతిసారీ అబద్ధాలే చెబుతున్నాడన్నారు. రైతాంగానికి పెద్దఎత్తున మేలుచేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, మంత్రులు, అబద్ధాలతో రైతులను మభ్యపెట్టడానికి చూస్తున్నారన్నారు.

రైతాంగాన్ని మంత్రులు ఎంతచులకనగా చూస్తున్నారోవారి వ్యాఖ్యలే చెబుతున్నాయని శ్రీనివాసరెడ్డి చెప్పారు. వరదలు, వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలెక్కింపు, ధాన్యం కొనుగోలు, కౌలురైతులను ఆదుకోవడంలో, రైతుభరోసా సాయంలో రాష్ట్రప్రభుత్వం అబద్ధాలమీద అబద్ధాలే చెబుతోందన్నారు.  ధాన్యం కొనుగోలులో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం ప్రకటించిన రూ.1415రూపాయలకు ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా జరగడం లేదన్నారు.

అప్పులపాలైన రైతులు తమధాన్యాన్ని  రూ.900, రూ.1000లోపు ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులకు ధాన్యాన్ని నిల్వచేసుకునే  సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతో, చేసేది అయినకాడికి కల్లాల్లోనే అమ్ముకుంటున్నారన్నారు.

కౌలు రైతుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం వారికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. గతప్రభుత్వం 15లక్షలమంది కౌలురైతులను గుర్తిస్తే, ఈప్రభుత్వం వారిసంఖ్యను లక్షా53వేలకే పరిమితంచేసింద ని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పాలకుల చేతిలో రెవెన్యూ యంత్రాంగం ఉన్నప్పటికీ, పట్టాదారు, భూ అనుభవదారులను గుర్తించడంలో ఈ దద్దమ్మ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

కౌలురైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, రైతుభరోసా వంటివేవీ అందడం లేదని, తద్వారా వారు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా రైతులను,  కౌలురైతులను ప్రభుత్వం గుర్తించి, వారికి న్యాయం చేయాలని మర్రెడ్డి డిమాండ్ చేశారు. కౌలురైతులకు అన్యాయం జరిగిన పక్షంలో వారిపక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగురైతు విభాగం ఉద్యమిస్తుందని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసుల ఎన్ కౌంటర్లను ప్రోత్సహించకూడదు: సుప్రీంకోర్టు మాజీ జడ్జి