విద్యార్థినిపై కిరాతక ఆటోడ్రైవర్ అత్యాచారం.. నడిరోడ్డుపై బట్టలు లేకుండా..

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (22:35 IST)
తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న కడపలో మహిళపై అత్యాచారం జరుగగా.. తాజాగా రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్‌ను దారి మళ్లించి దారుణం చేశాడు ఓ కిరాతక ఆటోడ్రైవర్.. విద్యార్ధినిపై అత్యాచారం చేసి నడిరోడ్డుపై బట్టలు లేకుండా వదిలిపెట్టేశాడు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వస్తుండగా జోడిమెట్లలోని పొదల్లోకి తీసుకెళ్లి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
 
ఈ క్రమంలోనే అమ్మాయిని వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు అమ్మాయిని రక్షించి మేడిపల్లిలో క్యూర్ హాస్పిటల్‌కి తరలించారు. ఘట్కేసర్ పోలీసులు బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ఆటోడ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఆటో డ్రైవర్ ఒక్కరే కారణమా? అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments