Publish Date: Tue, 09 Feb 2021 (11:20 IST)
Updated Date: Tue, 09 Feb 2021 (11:21 IST)
అనంతపురంలో ఫిట్స్ వచ్చి స్థానిక హమాలీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఆదినారాయణ (42) మృతి చెందాడు. హమాలీ కాలనీలో మట్కా రాస్తున్నట్లు డయల్- 100కు స్థానికులు సమాచారం చేరవేశారు.
ఇందుకు పోలీసులు స్పందించి హమాలీకాలనీలో మట్కా రాస్తున్న సూరిను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ. 350 ల మట్కా పట్టీలు కూడా లభ్యమయ్యాయి. దీంతో విచారణ నిమిత్తం సూరిని అదే కాలనీకి చెందిన ఆదినారాయణ ఆటోలో ఎక్కించారు.
ఆటో నడుపుతున్న ఆదినారాయణకు హౌసింగ్ బోర్డ్ పవన్ గ్యాస్ దగ్గరలో అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. ఆటోను ఆపి అతని చేతిలో బీగాల పెట్టి చూడగా అతను వెంటనే ఆటోలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు ఆ కాలనీ వారిని పిలిపించి అతని భార్యకు ఆదినారాయణను అప్పగించారు. సూరిని టూటౌన్ పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆదినారాయణను స్థానిక సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు పేర్కొన్నారు.