Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళ ఆటోలోకి ఎక్కగానే పొదల్లోకి తీసుకెళ్లి బలాత్కారం యత్నం

Advertiesment
మహిళ ఆటోలోకి ఎక్కగానే పొదల్లోకి తీసుకెళ్లి బలాత్కారం యత్నం
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:34 IST)
నెల్లూరు జిల్లా కేంద్రంలోని మినీ బైపాస్ రోడ్డులో ఓ మహిళ ఆటో ఎక్కగానే ఆ ఆటో డ్రైవర్ నేరుగా ముళ్ల పొదల్లోకి తీసుకెళ్ళి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కానీ, ఆ మహిళ ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ మున్సిపల్ కార్మికురాలిగా పని చేస్తోంది. ఈమె పనులకు వెళ్లేందుకు ఆటో ఎక్కగా, పొదల్లోకి ఎత్తుకెళ్లి బలవంతం చేయబోయాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
 
తీవ్రగాయాలైన బాధితురాలిని‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పెయిడ్ ఆర్టిస్ట్ లంతా నేడు ఏమయ్యారు? : వంగలపూడి అనిత