Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్లపై దాడి చేస్తే మూడేళ్ళ జైలు : మంత్రి కేటీఆర్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:37 IST)
తాజాగా తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్‌కు చికిత్స చేస్తున్న వైద్యులపై దాడులు జరిగాయి. ఈ దాడి ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. వీటిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్యులపై దాడులకు పాల్పడేవారికి మూడేళ్ళ జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వైద్యులు, ఇతర సిబ్బందిపై దాడులకు పాల్పడితే మూడేండ్ల జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. దీంతోపాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారని తెలిపారు.
 
'మెడికేర్‌ సర్వీస్‌ పర్సన్‌ అండ్‌ మెడికేర్‌ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ప్రొటెక్షన్‌ ఫ్రమ్‌ వయొలెన్స్‌ అండ్‌ డ్యామేజి ప్రాపర్టీ) చట్టం 2008 ప్రకారం దోషులకు శిక్ష పడుతుంది. ఈ కేసు నమోదైతే బెయిల్‌ కూడా లభించదని గుర్తుచేశారు. 
 
ఈ చట్టం ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ, బుధవారం గాంధీ దవాఖానలో జరిగిన వైద్యులపై దాడి ఘటన నేపథ్యంలో మరింత కఠినంగా అమలుచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడినా, దవాఖానల్లో ఆస్తులను ధ్వంసంచేసినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
గతేడాది నిలోఫర్‌ దవాఖానలో వైద్యులపై దాడి కేసులో, లక్డీకాపూల్‌లోని కార్పొరేట్‌ దవాఖానపై జరిగిన దాడి కేసులోనూ నిందితులను జైలుకు పంపించినట్లు గుర్తుచేశారు. ఈ చట్టంలో నిబంధనలు ఇలా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments