Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు మందు ఇచ్చి దాడి.. 14 ఏళ్ల బాలిక మృతి.. 70మంది వద్ద విచారణ

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:56 IST)
14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఆశ్రమ నిర్వాహకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణానికి వార్డెన్ కూడా సహకరించాడు. ఈ ఘటనకు సంబంధించి చేస్తోన్న విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మైనర్ బాలికపై సైతం నిందితుడు వేణుగోపాల్ లైంగికదాడి పాల్పడినట్లు సమాచారం. 
 
దీనిపై కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాహకులు బెదిరింపులకు తెగబడినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో వీరు అక్రమాలకు తెగబడినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో రెస్కూ చేసిన మైనర్లను ఇక్కడికే పంపాలని సిబ్బందిపై ఒత్తిడి చేశారని సమాచారం. 
 
ఈ ఘటనపై వేసిన హైపవర్ కమిటీ విచారణలో ఈ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అనాధ ఆశ్రమంలోని 70మందిని అధికారులు విచారించనున్నారు. రాష్ట్రంలోని ఇతర అనాధ ఆశ్రమాలలో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 అనాధ ఆశ్రమాలు, 19వేల మంది అనాధలు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం