Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ హింసాకాండ సూత్రధారి అలహాబాద్ పృథ్వీరాజ్

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (15:00 IST)
సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ హింసాకాండ జరిగింది. ఈ హింసాకాండకు సంబంధించిన వీడియోలు వెలుగు చూశాయి. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి అలహాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్ అని, అతనే హింసకు పాల్పడేలా ఇతర యువకులను ప్రోత్సహించినట్టు తేలింది. 
 
దీంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ముందుగా ప్యాసింజర్ బోగీలోకి వెళ్ళి సీట్లకు నిప్పుపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్‌ఫాంపై ఉన్న రైల్వే ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. వాట్సాప్ చాటింగ్, పోస్టుల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
రైలు ప్యాసింజర్ బోగీలో సీట్లకు నిప్పుపెడుతూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశాడు. ఆ విజువల్స్‌ను వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి యువకులను రెచ్చగొట్టినట్టు పోలీసులు తేల్చారు. శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన అభ్యర్థులను పృథ్విరాజే విధ్వంసానికి పాల్పడేలా ప్రేరేపించినట్టు నిర్ధారించారు. రైల్వే ఆస్తులను, బోగీలను కూడా నాశనం చేశాడు. దీంతో పృథ్వీరాజ్‌తో పాటు మొత్తం 10 మందిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments