Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నదిలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు - చితకబాదిన భక్తులు

Advertiesment
couple
, గురువారం, 23 జూన్ 2022 (07:27 IST)
పవిత్రమైన సరయూ నదిలో స్నానం చేస్తూ, తన భార్యకు భర్త ముద్దు పెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర భక్తులు వారిని చితకబాదారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పవిత్ర సరయూ నదిలో ఓ దంపతుల జంట స్నానానికి దిగింది. ఈ క్రమంలో భార్యకు భర్త ముద్దుపెట్టాడు. పక్కనే స్నానం చేస్తున్న వారు అది చూసి అతపై దాడికి దిగారు. అయోధ్యలో ఇలాంటి వాటిని సహించబోమని మూకుమ్మడిగా దాడి చేశారు. నది నుంచి బయటకు లాక్కుంటూ దాడి చేశారు. 
 
భార్య అడ్డం పడుతున్నా ఆగలేదు సరికదా, తిడుతూ అతడిని కొడుతూనే ఉన్నారు. ఓ వ్యక్తి మాత్రం వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపారు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అది తిరిగి తిరిగి పోలీసులకు చేరడంతో దృష్టిలో పడటంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొట్టమొదటి డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌