Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో వివాహేతర సంబంధం.. లవర్ ఆ పని చెప్పగానే చేసేసింది...

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (18:33 IST)
హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసముండే ఖుష్బూకి జోరుగా షికార్లు, ప్రతిరోజు ఎంజాయ్‌మెంట్ చేయడమంటే ఎంతో ఇష్టం. అంత డబ్బు లేదు కదా. తన భర్త ఉదయం వెళితే ఇక రాత్రికే ఇంటికి వచ్చేవాడు. ఇలాంటి తరుణంలో తన ఇంటి పక్కనే సూర్యక్రిష్ణ పరిచయమయ్యాడు. సూర్యక్రిష్ణ డిగ్రీ విద్యార్థి. జల్సాగా తిరుగుతూ ఉండేవాడు.
 
దీంతో ఆమె సూర్యక్రిష్ణకు బాగానే కనెక్ట్ అయ్యింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టేసుకుంది. ప్రతిరోజు తన భర్త ఇంటి నుంచి వెళ్ళిపోగానే ఈమె కూడా సిటీ మొత్తం సూర్యక్రిష్ణతో కలిసి తిరుగుతూ ఉండేది. అయితే వారంరోజుల క్రితం సూర్యక్రిష్ణ దగ్గర కూడా డబ్బులు అయిపోయాయి. తిరగడానికి డబ్బులు లేవు. దీంతో ఆమెకి విషయం చెప్పాడు. 
 
తన ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నదనీ, తను కూడా  ఏం చేయలేనని చెప్పింది. దీంతో సూర్యక్రిష్ణ ఒక ఐడియా ఇచ్చాడు. మీ బంధువుల్లో బాగా డబ్బులు ఉన్న వారితో పరిచయం పెంచుకోమన్నాడు. తన ఇంటికి దగ్గరలో ఉన్న కుమారితో పరిచయం పెంచుకుంది ఖుష్బూ. అలా వారి ఇంటికి వెళుతూ వస్తూ ఉండేది. 
 
కుమారికి భర్త లేడు. కానీ ఆస్తిపరురాలు. ఖుష్భూను బాగా నమ్మింది. ఇలా రెండురోజుల క్రితం కుమారికి విరోచనాల మందును పాలల్లో కలిపి ఇచ్చేసింది ఖష్భూ. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళపోయింది. ఖుష్బూ దగ్గరుండి ఆమెను ఆసుపత్రిలో చేర్పించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం ఖుష్భూ వద్దే ఇంటి తాళాలు ఉండడంతో ఆ తాళాలను తన ప్రియుడు సూర్యక్రిష్ణకు ఇచ్చింది. 
 
తాళాలు తీసుకున్న సూర్య తన స్నేహితుడి సహాయంతో ఇంటి తాళాలు తీసి నగలు, నగదు దోచుకున్నాడు. ఆ తరువాత తాళాలు వేసి ఖుష్బూకు ఇచ్చేశాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత ఇంటికి వచ్చిన కుమారికి దొంగతనం జరిగినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఖుష్భూ నిజాలను ఒప్పుకుంది. ప్రస్తుతం కటాకటాల్లో వున్నారు ఖుష్భూ ఆమె ప్రియుడు సూర్యక్రిష్ణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments