యువకుడితో వివాహిత వివాహేతర సంబంధం, అవి కోసేసిన పెద్దలు

బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (18:12 IST)
వారిద్దరికీ వివాహేతర సంబంధం ఉంది. వారిని ఎలాగైన పట్టుకోవాలని స్థానికులు భావించారు. సమయం చూసి ఇద్దరిని పట్టుకున్నారు. వారిని కొట్టడమే గాక మరోసారి ఇలాంటి తప్పు చేయొద్దని చెబుతూ ముక్కులు కోసి తగిన గుణపాఠం చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో జరిగిన ఘటన జరిగింది. 
 
ఫైజాబాద్ జిల్లా పత్రాంగ పోలీసు స్టేషన్ పరిధిలో గల కంద్ పిప్రాలో వివాహిత తన ఫ్యామిలీతో ఉంటోంది. అయితే భర్త ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. ఆమె ఒక్కరే ఉండటంతో కోరికను ఆపులేకపోయింది. దాంతో గ్రామానికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తీరు మార్చుకోవాలని వారిద్దరికీ పెద్దలు సూచించినా వినిపించుకోలేదు.
 
వారిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించారు. వివాహిత ఇంటికొచ్చిన సమయంలో అదనుచూసి పట్టుకున్నారు. వారిద్దరికీ దేహశుద్ది చేశారు. అంతటితో ఆగకుండా వారి ముక్కులను కూడా కోశారు. భవిష్యత్‌లో ఇలాంటి తప్పు చేయకుండా ఇలా చేశామని పెద్దలు చెప్తున్నారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి పోలీసులు వచ్చారు. ముక్కులు కోయడంతో వారిద్దరికీ తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని చెప్తున్నారు.
 
వివాహిత-యువకుడు.. హిందూ..ముస్లింలు కావడం విశేషం. వారిద్దరినీ పట్టుకొని ముక్కు కోయడంతో గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందేమోనని పోలీసు బలగాలను మొహరించారు.  

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే కొత్త మహమ్మారి ఇదేనా