Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి పొద్దుపోయే దాకా భర్త రాడని పక్కింటి యువకుడితో ఫ్రెండ్‌షిప్, ఆ తర్వాత?

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (18:07 IST)
రాజు ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. తన స్నేహితులందరికీ పెళ్ళయిపోతోంది. తనకు మాత్రం వివాహం కాలేదు. తల్లిదండ్రులు మ్యాచెస్ చూస్తున్నారు. రాజు హైదరాబాద్ లోని లింగంపల్లిలో ఉండేవాడు. అమ్మాయి మెహిదీపట్నంలో ఉండేది. ఆమె పేరు రేవతి.  
 
సరిగ్గా ఆరు నెలల క్రితం వీరికి పెద్దలు పెళ్ళి చేసేశారు. మొదట్లో వీరి కాపురం సాఫీగానే సాగింది. సరిగ్గా కరోనా కన్నా ముందే వీరి జీవితంలో మార్పులు ప్రారంభమయ్యాయి. అందుకు కారణం రేవతి.
 
రాజు డైలీ ఫైనాన్స్ చేసేవాడు. తన దగ్గరున్న డబ్బులు అప్పుగా ఇచ్చి ప్రతిరోజు వడ్డీలను వసూలు చేసేవాడు. ఉదయం వెళితే సాయంత్రం వరకు ఇదే పని. స్నేహితులు ఎక్కువే. వివాహమైనా సరే స్నేహితులతోనే ఎక్కువగా గడిపేవాడు. సాయంత్రం బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చేవాడు.
 
అయితే రేవతితో తన ఇంటి పక్కన దిలీప్ అనే యువకుడు మెల్లగా పరిచయం పెంచుకున్నాడు. దిలీప్ రెస్టారెంట్ ఓనర్. రేవతికి ఖాళీగా ఉండటం ఇష్టం లేక భర్త బయటకు వెళ్ళిందే దిలీప్ రెస్టారెంట్‌కు వెళ్ళి క్యాషియర్‌గా కూర్చునేది. మధ్యాహ్నం వరకు కూర్చుని ఆ తరువాత ఇంటికి వచ్చేసేది.
 
ఇలా భర్తకు చెప్పి రెస్టారెంట్ ఉద్యోగానికి వెళ్ళింది. అయితే దిలీప్‌తో రేవతికి వున్న పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. కరోనా సమయంలో రెస్టారెంట్ మూసేయడంతో ఇక వీరికి హద్దు లేకుండా పోయింది. ఇష్టానుసారం ఇద్దరూ తిరిగేవారు. 
 
ఈ విషయం భర్తకు తెలియలేదు. అయితే కొన్నిసార్లు రాత్రివేళల్లో కూడా రేవతి ఇంటికి రాకపోవడం, స్నేహితురాళ్ల ఇళ్లకు వెళ్తున్నానని చెప్తుండటంతో రాజుకు అనుమానం వచ్చింది. దిలీప్‌తో ఆమె సన్నిహితంగానే ఉండటాన్ని పసిగట్టాడు. దీనితో రాజు సైకోగా మారిపోయాడు. ఆ బాధను భరించలేక పూటుగా మద్యం సేవించి తిరిగేవాడు. సరిగ్గా వారంరోజుల క్రితం తన భార్య దిలీప్ ఇంటి నుంచి బయటకు వస్తుండటాన్ని చూసిన రాజుకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెను చితకబాదాడు.
 
పంచాయతీ కాస్త పోలీసుల వద్దకు వెళ్ళింది. పోలీసులు విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. మెహిదీపట్నం పోలీసులు రేవతి, రాజును పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. పచ్చటి కాపురాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి దిలీప్‌ను అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments