ఎమ్మెల్సీ కుమారుడు అన్నాడు.. వివాహితను అలా వేధించాడు..

శుక్రవారం, 22 మే 2020 (12:05 IST)
వివాహితను స్నేహం చేసుకున్న ఓ వ్యక్తి ఆమెను వేధింపులకు గురిచేశాడు. తనను తాను ఎమ్మెల్సీ కుమారుడు అని పరిచయం చేసుకున్నాడు. అలా వివాహితతో ఏర్పడిన స్నేహాన్ని అదనుగా తీసుకుని డబ్బుల కోసం వేధించాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వివాహిత (30)కి కొంత కాలం క్రితం భరత్‌కుమార్ అలియాస్ చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భరత్ కుమార్ తనను తాను ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీనిని అవకాశంగా తీసుకున్న నిందితుడు తనలోని అసలు రూపాన్ని బయటకు తీశాడు. 
 
తనకు వెంటనే రూ. 15 లక్షలు ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టాడు. ఇవ్వకుంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బెదిరించాడు. అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రెపో రేటు తగ్గింపు.. మారటోరియంను మరో 3 నెలల పొడిగింపు