Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావకు గుణపాఠం చెప్పాలని కటకటాల పాలయ్యాడో బావమరిది..

సోదరిని ఇబ్బంది పెడుతున్నాడని వేరే వారితో బెదిరించేందుకు సుపారి ఇచ్చాడో బావమరిది. తనకు తోడుగా వచ్చిన తన బావమరిదే అసలు నేరస్థుడు అని తేలడంతో అవాక్కయ్యాడు బావ. అంబర్‌ పేటకు చెందిన నరేష్, శ్రీనివాస్‌ బావాబామ్మర్దులు. నరేష్‌ తన సోదరితో గొడవ పడుతున్నాడని

Webdunia
బుధవారం, 6 జూన్ 2018 (21:23 IST)
సోదరిని ఇబ్బంది పెడుతున్నాడని వేరే వారితో బెదిరించేందుకు సుపారి ఇచ్చాడో బావమరిది. తనకు తోడుగా వచ్చిన తన బావమరిదే అసలు నేరస్థుడు అని తేలడంతో అవాక్కయ్యాడు బావ. అంబర్‌ పేటకు చెందిన నరేష్, శ్రీనివాస్‌ బావాబామ్మర్దులు. నరేష్‌ తన సోదరితో గొడవ పడుతున్నాడని తెలుసుకున్న శ్రీనివాస్‌.. బావకు గుణపాఠం చెప్పాలని భావించాడు. 
 
ఇందుకోసం ముగ్గురు మిత్రులకు సుపారి ఇచ్చాడు. బావతో కలసి ఓ ఫంక్షనుకు వెళ్ళి వస్తుండగా.. అడ్డుకుని దాడి చేసి నగదు, సెల్ ఫోన్ తీసుకుని వెళ్లిపొమ్మని వారికి స్కెచ్‌ వేసి వచ్చాడు. బావ నరేష్‌‌తో కలసి వస్తూ శ్రీనివాస్‌.. పూర్తి సమాచారాన్ని సుపారి గ్యాంగ్‌‌కు ఇచ్చాడు. పధకం ప్రకారం సికింద్రబాద్‌ బౌద్దనగర్‌‌లో నరేష్‌, శ్రీను వస్తున్న సమయంలో వారిపై దాడి చేసి సెల్‌ ఫోన్‌, నగదు లాక్కుని వెళ్ళిపోయారు.
 
దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు నరేష్. రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్‌ పైన అనుమానంతో.. టెక్నికల్‌ టీం సహాయంతో డేటా సేకరించారు. చివరికి దాడి చేసిన ముగ్గురు నిందితులతో పాటు బావమరిది శ్రీనివాస్‌‌ను కటకటాల వెనక్కి నెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments