Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను ప్రియుడితో పంపేసిన భర్త... ఆ తరువాత ఏమైందో తెలిస్తే షాకే..

పెళ్ళికాక ముందు ప్రియుడితో తిరిగిన తన భార్యను ఎవరైనాసరే మందలించి కాపురాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అంతా రివర్స్. పెళ్ళయి ఆరు సంవత్సరాలు అవ్వడమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా తన భార్య... ప్రియుడిని మర్చిపోలేకుండా పోయ

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (15:08 IST)
పెళ్ళికాక ముందు ప్రియుడితో తిరిగిన తన భార్యను ఎవరైనాసరే మందలించి కాపురాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అంతా రివర్స్. పెళ్ళయి ఆరు సంవత్సరాలు అవ్వడమే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా తన భార్య... ప్రియుడిని మర్చిపోలేకుండా పోయింది. దీంతో ఏ భర్త చేయని పనిని ఆ భర్త చేశాడు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారుతోంది. 
 
మహబూబ్ నగర్ జిల్లా కోల్వగుంట మండలంకు చెందిన బాబు, భాగ్యమ్మలకు ఆరు సంవత్సరాల క్రితం పెళ్ళయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాబు పని కోసం కుటుంబాన్ని తీసుకుని మహబూబ్ నగరానికి వచ్చాడు. బాబు పెద్దగా చదువుకోకపోవడంతో అతనికి ఎక్కడా ఉద్యోగం రాలేదు. ఇంట్లో కుటుంబ పోషణ బాగా భారమైంది. దీంతో భార్య కుట్టుమిషన్ కుడుతూ జీవనం సాగించేది. అయితే తనకు ఉద్యోగం లేదన్న బాధతో పూటుగా మద్యం సేవించి ప్రతిరోజు ఇంటికి వచ్చేవాడు బాబు. భర్తను మార్చాలని ఎంతగానో భార్య ప్రయత్నించింది. అయినా మార్పు రాలేదు. 
 
అయితే భాగ్యమ్మ ఉన్న ప్రాంతంలోనే ఆమె ప్రియుడు ఖాదర్ ఉండేవాడు. దీంతో భర్త ఇంట్లో లేని సమయంలో ఖాదర్‌తో ఎక్కువ సేపు గడిపేది భాగ్యమ్మ. విషయం కాస్తా భర్తకు తెలిసింది. ఏ భర్త అయినా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే గొడవ చేస్తాడు. కానీ బాబు మాత్రం తనకు ఉద్యోగం లేదన్న బాధతో కుటుంబ పోషణ భారమవుతుందని భార్యను ప్రియుడికి అప్పజెప్పి పిల్లలను తీసుకొని తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు. 
 
భాగ్యమ్మ ఎక్కుడుందని ఆమె తల్లిదండ్రులు ప్రశ్నిస్తే జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన భర్త ఇష్టానుసారమే ప్రియుడితో కలిసి ఉన్నానని భాగ్యమ్మ చెబుతుండటంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments