Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భర్త నాతో కాపురం చేయాలి.. చర్యలు తీసుకోండి.. పోలీసులతో హిజ్రా

ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరాక అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడు. ఎదురు తిరిగితే దాడి చేసి ముఖం చాటేశాడు. ప్రస్తుతం తన భర్త తనతో కాపురం చేసేలా చర్యలు తీసుకోండి అంటూ ఓ హిజ్రా పోలీసు

Advertiesment
Hijra
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (14:37 IST)
ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరాక అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడు. ఎదురు తిరిగితే దాడి చేసి ముఖం చాటేశాడు. ప్రస్తుతం తన భర్త తనతో కాపురం చేసేలా చర్యలు తీసుకోండి అంటూ ఓ హిజ్రా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు దీపిక అనే హిజ్రా విశాఖ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. దీపిక (25)ది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. విశాఖలోని పెదవాల్తేరులో స్థిరపడింది. 2009లో ఆపరేషన్‌ చేయించుకుని మహిళగా మారింది. నాలుగేళ్ల కిందట శివాజీపాలేనికి చెందిన చందక సురేశ్‌ ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి ప్రతిపాదన తేవడంతో దీపిక అంగీకరించింది. అయితే తాను హిజ్రాను కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రానివ్వనని అగ్రిమెంట్‌‌కు రాసుకుంది. 
 
ఈ మేరకు గతేడాది అక్టోబర్‌ 6న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వారి కాపురంలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. దీపికను సురేశ్‌, అతని మేనమామ భార్య కలిసి తమకు మరో రూ.6 లక్షలు అదనంగా కట్నం కావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. 
 
అదేమిటని ప్రశ్నిస్తే ఆమెను చితక్కొట్టిన సురేశ్‌ అప్పటి నుంచి ఆమె వద్దకు వెళ్లడం మానేశాడు. దీంతో దీపిక న్యాయం కోసం జూలై 27న మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సురేశ్‌కు కౌన్సెలింగ్‌ చేసినా మారకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గే సెక్స్... ఇండియాలో ఇక పిచ్చపిచ్చగా ఎయిడ్స్ కేసులు...