Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధి గడ్డి తిని ప్రియురాలిని చేసుకున్నా... ప్లీజ్ రక్షించండి... లేదంటే దూకేస్తా...

అయ్యా.. నేను నా భార్యతో వేగలేను. నన్ను రాచిరంపాన పెట్టేస్తోంది. నావల్ల కావడం లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించడంటూ తెలంగాణా రాష్ట్రం జగిత్యాలలో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. మూడున్నర గంటలకుపైగా సెల్

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (15:25 IST)
అయ్యా.. నేను నా భార్యతో వేగలేను. నన్ను రాచిరంపాన పెట్టేస్తోంది. నావల్ల కావడం లేదు. దయచేసి నాకు విడాకులు ఇప్పించడంటూ తెలంగాణా రాష్ట్రం జగిత్యాలలో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. మూడున్నర గంటలకుపైగా సెల్ టవర్ పైనే ఉన్న యువకుడిని కిందకు దించేందుకు పోలీసులు నానా బాధలు పడ్డారు. జగిత్యాలకు చెందిన అజయ్ కుమార్, లాస్యలు ఏడేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ళ కుమార్తె ఉంది. 
 
2014 సంవత్సరం నుంచి వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని తనను డబ్బు తెమ్మన్నాడంటూ వరకట్నం కింద లాస్య అజయ్ పైన కేసు పెట్టింది. ఆ కేసు రెండు సంవత్సరాల పాటు నడిచి కొట్టేశారు. మళ్ళీ తాజాగా మరో కేసు పెట్టింది లాస్య. దీంతో అజయ్ సెల్ టవర్ ఎక్కి నాకు విడాకులు కావాలి. 
 
బుద్ధి గడ్డి తిని నా ప్రియురాలిని భార్యగా చేసుకున్నా. ప్లీజ్ నాకు విడాకులు ఇప్పించండి. లేకుంటే దూకేస్తానంటూ హల్ చల్ చేశాడు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అజయ్‌ను కిందకు దించే ప్రయత్నం చేశారు. అయితే అజయ్ ఎంతకూ ఒప్పుకోలేదు. చివరకు భార్యా భర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి విడాకులు ఇస్తామని చెప్పడంతో యువకుడు కిందకు దిగాడు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments