Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాబ్ బుక్ చేసుకున్నందుకు భార్య విడాకులిచ్చేసింది.. ఏం జరిగింది?

క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా కాపురం నిలువునా కూలిపోతుందనుకోలేదే అని ఆ ఫ్రెంచ్ భర్త లబోదిబోమంటున్నాడు. ఆయన ఏడుపుకు అర్థం ఉంది మరి. భార్య విడాకులిచ్చింది. పరువుపోయంది. దీంతో ఈయనకు కడుపు మండింది. ఫలితం పోయిన పరువుకు గాను 335 కోట్ల రూపాయలు కడతారా చస్తారా అ

క్యాబ్ బుక్ చేసుకున్నందుకు భార్య విడాకులిచ్చేసింది.. ఏం జరిగింది?
, సోమవారం, 6 మార్చి 2017 (15:07 IST)
క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా కాపురం నిలువునా కూలిపోతుందనుకోలేదే అని ఆ ఫ్రెంచ్ భర్త లబోదిబోమంటున్నాడు. ఆయన ఏడుపుకు అర్థం ఉంది మరి. భార్య విడాకులిచ్చింది. పరువుపోయంది. దీంతో ఈయనకు కడుపు మండింది. ఫలితం పోయిన పరువుకు గాను 335 కోట్ల రూపాయలు కడతారా చస్తారా అంటూ కేసు వేశాడు.  
 
వివరాలు ఇలా వున్నాయి.... షికారుకు వెళ్లేందుకు భార్య ఫోన్ నుంచి ఓసారి క్యాబ్ బుక్ చేసిన పాపానికి అది విడాకులకు దారితీసిందని ఫ‍్రెంచి వ్యాపారవేత్త ఒకరులబోదిబో మంటున్నాడు. ఇందుకు కారణమైన ఉబర్ క్యాబ్ సంస్థ తనకు నష్టపరిహారంగా 40 మిలియన్ పౌండ్లు (భారత కరెన్సీలో దాదాపు 335 కోట్ల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని దావా వేశాడు. 
 
అసలు ఏం జరిగిందంటే.. దక్షిణ ఫ్రాన్స్ లోని కోట్ డీ అజర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఓరోజు షికారుకు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. భార్య మొబైల్‌లో ఉన్న యాప్‌తో ఓ ఈవెంట్‌కి వెళ్లారు. ఆ తర్వాత భార్య మొబైల్ నెంబర్ నుంచి లాగ్ ఔట్ అయ్యాడు.
 
అప్పటినుంచి ఆ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా.. అతడి భార్య మొబైల్స్‌కు అప్ డేట్స్ వెళ్తున్నాయి. కొన్ని రోజుల వరకు భార్య ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ బిజినెస్ పని మీద ఉండే భర్త తరచుగా కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నాడని గ్రహించింది. ఉబర్ క్యాబ్ అప్లికేషన్ సాంకేతిక లోపం వల్ల భార్య తనను అనుమానిస్తోందని ఆరోపించాడు. చివరికి ఇద్దరి మధ్య అంతరం పెరిగిపోయి విడాకులు ఇచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
తన పరువు పోయిందని, ఇందుకు కారణమైన ఉబెర్ సంస్థ తనకు 335 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆ వ్యాపారవేత్త కోర్టుకెక్కాడు. తొలిసారి లాగిన్ డాటాతో తాను ఎక్కడ యాప్ వాడినా తన భార్య మొబైల్‌కు మెస్సేజ్ వెళ్లడమే తమ మధ్య గొడవలకు కారణమైందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉబర్ మాత్రం ఈ విషయంపై ఏ విధంగానూ స్పందించలేదు.
 
ఉబెర్ స్పందన, ఈయన గారి ప్రతి స్పందన ఏమవుతాయన్నది తర్వాత మాట కానీ, మీరు ప్రయాణం చేయాలనుకుంటే మీ మొబైల్ నుంచి యాప్ ద్వారా బుక్ చేసుకోండి అంతేగాని ఎంత భార్య అయినా సరే ఆమె ఫోన్ జోలికి వెళ్లవద్దని, వెళ్లినా దాన్నుంచి క్యాబ్ లాంటివి బుక్ చేసుకోవద్దని ఈ ఉదంతం పాఠం చెబుతోంది కదా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓరీ జాత్యహంకారీ ట్రంప్.. అనాథలా కుక్క చావు చస్తావు...: సిద్ధాంతి ములుగు శాపం