Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నుగీటి లవ్‌లో పడ్డానంది... నమ్మేసి లక్షలిచ్చాడు... మరొకడిని పెళ్లాడేసరికి...

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (12:48 IST)
తియ్యటి మాటలతో ప్రేమలోకి దింపింది ఆ మాయలాడి. ప్రేమిస్తున్నానని అందమైన యువతి చెప్పిన మాటలకు ఊహాలోకంలో తేలిపోయాడతను. ప్రాణం కంటే మిన్నగా యువతిని ప్రేమించాడతను. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. ప్రియుడి నుంచి లక్షల రూపాయలు దండుకుని చివరికి మరొకడ్ని పెళ్లాడింది. ప్రియురాలు చేసిన మోసాన్ని ఆ ప్రియుడు కుంగిపోయి తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆ ప్రియుడు.
 
 
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన యువతిని అమీర్ పేట్‌కు చెందిన అఖిల్ రెడ్డి ఓ ఫంక్షన్లో చూశాడు. కవ్వింపు చూపులతో ఈ యువతి మెల్లిగా అఖిల్ రెడ్డితో మాటలు కలిపింది. ప్రేమ వల విసిరింది. ఓ రోజు ప్రేమిస్తున్నా.. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంతా నిజమే కాబోలు అనుకున్నాడతను. స్వప్న సుందరి కళ్లముందు సాక్షాత్కరించి పెళ్లాడుతాననేసరికి అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయ్. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తొందరపడ్డారు. 
 
తనతో గడిపిన ఆ మధుర క్షణాల్ని భద్రంగా రికార్డు చేసి దాచుకున్నాడతను. డబ్బు అవసరమని చెప్పింది. కాబోయే భార్యే కదా అని భావించి ఆమె అడిగినంత డబ్బిచ్చేవాడు. అతని నుంచి మరింత డబ్బు గుంజాలనుకుంది. మూడున్నర లక్షల రూపాయలు అవసరమంటే.. అప్పటికప్పుడు బ్యాంకు లోను తీసుకుని ఆ డబ్బు తెచ్చి ప్రియురాలి చేతిలో పెట్టాడు. పెళ్లి మాటెత్తేసరికి అఖిల్‌ను దూరంపెట్టేసింది. తనతో ప్రియురాలు మాట్లాడకపోయేసరికి మానసికంగా కుంగిపోయాడు. 
 
తన ప్రియురాలు మరొకడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సుకుని అఖిల్ తట్టుకోలేకపోయాడు. అమీర్ పేట్‌లోని తన రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
తనను మోసం చేసినందుకే తాను చనిపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు అఖిల్. ప్రేమకోసం అఖిల్ ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments