ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (22:25 IST)
ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై కేసు నమోదైంది. ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశాడనే యువతి ఫిర్యాదు మేరకు మహేశ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐపీఎస్‌ సెలక్ట్‌ అయ్యాక కట్నం కోసం వేధిస్తున్నాడని... యువతి ఆరోపించింది. ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్‌రెడ్డిపై తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పోలీసులు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేశారు. వారిద్దరికీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి పరిచయం. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

తొమ్మిదేళ్ల తర్వాత మహేశ్​ పెళ్లి చేసుకోమని అడగ్గా... ఇంట్లో ఎలా ఒప్పిస్తావంటూ ఆమె ప్రశ్నించింది. తాను ఐపీఎస్​గా సెలెక్ట్​ అయితే ఇంట్లో వారి అంగీకారం లభిస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత మహేష్​ ఐపీఎస్​కు ఎంపికయ్యాడు. అప్పుటినుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు వాపోయింది.

కట్నం ఇవ్వాలంటూ... వేధించడం ప్రారంభించాడని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని లేకపోతే... వేరే అమ్మాయిని వివాహమాడతానని ఆమెను బెదిరించాడని చెబుతూ... తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జవహర్​నగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు.. మహేశ్​ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments