Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బురిడీ లెక్కలు వద్దు... ఆర్టీసీకి రూ.47 కోట్లు ఇవ్వలేరా : కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ప్రశ్న

Advertiesment
బురిడీ లెక్కలు వద్దు... ఆర్టీసీకి రూ.47 కోట్లు ఇవ్వలేరా : కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ప్రశ్న
, మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:58 IST)
ఆర్టీసీ సంస్థను ఆదుకునే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బ్యాంకులకు గ్యారెంటీగానే ఉంటుంజదని గుర్తు చేశారు. అలాగే, బకాయిలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పైగా, బకాయిల్లో ప్రభుత్వం ఇచ్చే నిధులను మినహాయించుకోవడాన్ని కూడా తప్పుబట్టింది. 
 
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆ సమయంలో ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కౌంటర్‌ దాఖలు చేశారు. ఆర్టీసీకి బకాయిలపై ఆర్థికశాఖ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మెడికల్ రియంబర్స్‌మెంట్, రిఫరల్ హాస్పటల్స్, యూనిఫారమ్స్, పీఎఫ్ మెడికల్స్.. ఈ నాలుగు డిమాండ్లకు సంబంధించి రూ. 47 కోట్లు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదా? అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. 
 
దీని సమాధానంగా రూ.47 కోట్లు వెంటనే ఇవ్వలేమని, గడువు ఇస్తే ప్రయత్నిస్తామన్న ఏజీ చెప్పారు. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించడంపై న్యాయస్థానం స్పందించింది. కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
 
మొత్తం ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎంత? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. బస్సులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ప్రజలు ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెబుతున్నారు.. మరోవైపు బస్సులు లేక ఇబ్బందిపడతారని విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు.. ఆర్టీసీ ఎండీ కోర్టు విచారణకు ఒక్కసారైనా హాజరయ్యారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. 
 
75 శాతం బస్సులు తిరుగుతున్నాయని కోర్టుకు తెలిపిన ఆర్టీసీ యాజమాన్యం.. ఇప్పటికీ మూడో వంతు బస్సులు కూడా తిరగడం లేదని హైకోర్టు మండిపడింది. అదేసమయంలో బుధవారం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేయతలపెట్టిన సకల జనుల భేరీకి అనుమతి ఇచ్చింది. 
 
పైగా, ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించలేమని తాము ఆదేశించలేమని స్పష్టం చేస్తూ పూర్తి వివరాలతో వచ్చే శుక్రవారం జరిగే విచారణకు హాజరుకావాలంటూ ఆర్టీసీ ఎండీతో పాటు.. ఆర్థిక శాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయి కోసం ఆప్తమిత్రుడిని దారుణంగా హత్య చేశాడు, ఎక్కడ?