Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక గ్రామంలో 45మందికి కరోనా.. ఆ శుభకార్యం కొంపముంచింది

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:51 IST)
తెలంగాణలో కోవిడ్ తగ్గుముఖం పడుతోంది. అంతేగాకుండా లాక్డౌన్‌ను ఎత్తివేసే అవకాసం కూడా వుంది. కానీ మధ్యాహ్నం వరకు సడలింపులు ఉండటంతో సడలింపులు ఉన్న సమయంలోనే శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. శుభకార్యాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతుంటారు. ఇలాంటి శుభకార్యాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది. 
 
తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కంఠం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యం కొంపముంచింది. ఈ శుభకార్యం జరిగిన తరువాత గ్రామంలో గత వారం రోజుల వ్వవధిలో 45 మందికి కరోనా సోకింది. 
 
ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర నుంచి ఈ శుభకార్యానికి హాజరైన వారి నుంచే కరోనా వ్యాప్తి చెందినట్లు అనుమానిస్తున్నారు. గ్రామంలో కేసులు పెరుగుతుండటంతో కంఠం గ్రామంలో అధికారులు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments