Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీ: 30మంది మృతి

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (09:41 IST)
Train
పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఢీకొట్టుకున్న సంఘటనలో 30మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి - దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌, సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, పట్టాలు తప్పిన సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును.. మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనలో 30 మంది మృతి చెందారని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలో పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా చెప్పారు. గాయపడ్డ వారిని దవాఖానాలకు తరలించారు. రెండు రైళ్ల బోగీల్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారని పేర్కొన్నారు. 
 
సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం తర్వాత ఆ రూట్‌లో నడిచే రైళ్లను నిలిపి వేసినట్లు అబ్దుల్లా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments