Webdunia - Bharat's app for daily news and videos

Install App

టపాకాయలు కొనేందుకు వెళ్లిన ఫ్యామిలీ.. రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (20:09 IST)
దీపాపళి పండుగకు టపాకాయలు కొనేందుకు వెళ్లిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గ్రామీణ ప్రాంతంలో జరిగింది. 
 
బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదాన్ని పరిశీలిస్తే, ఎల్లారెడ్డికి చెందిన శ్రీనివాస్ (52) పండుగ‌కు కూతురు, అల్లుడు ఇంటికి రావ‌డంతో దీపావ‌ళిని ధూంధాంగా జ‌రుపుకోవాలని భావించారు. దీంతో ప‌టాకులు, దీపాలు, ఇత‌ర సామ‌గ్రి కొనుగోలు చేసేందుకు బుధ‌వారం కారులో కామారెడ్డి వెళ్లాడు. త‌న‌తో పాటు అల్లుడు ఆనంద్ కుమార్ (31), సోద‌రుడు జ‌గ‌న్ (45 )తో పాటు మ‌రో ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల‌ను తీసుకెళ్లాడు. 
 
షాపింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం స‌మ‌యంలో తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. అప్ప‌టికే భారీ వ‌ర్షం కురుస్తుండ‌టంతో ఎర్ర‌ప‌హాడ్ స‌మీపంలోకి రాగానే వారు ప్ర‌యాణిస్తున్న కారు అదుపు త‌ప్పి, రోడ్డుప‌క్క‌న ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో శ్రీనివాస్‌, అత‌ని అల్లుడు ఆనంద్‌, సోద‌రుడు జ‌గ‌న్‌తో పాటు ఐదేళ్ల మ‌నుమ‌డు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. 
 
కారులో ఉన్న మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పండుగ పూట ఒకేసారి న‌లుగుర్ని కోల్పోవ‌డంతో ఆ కుటుంబంలో రోద‌న‌లు మిన్నంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments