Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆత్మహత్య

సెల్వి
గురువారం, 19 జూన్ 2025 (13:53 IST)
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదం వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో సురేశ్ రెడ్డి (28) అనే యువకుడు ఓ కంపెనీలో సీఏగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడితో కలిసి మణికొండలో ఉంటున్నాడు. 
 
అయితే జూన్ 16న సురేశ్‌ రెడ్డి తన సోదరి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొండాపూర్‌లోని రాజరాజేశ్వరీ కాలనీలో ఉన్న సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పని ఒత్తిడి తాళలేక సురేశ్ రెడ్డి హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
పని ఒత్తిడి తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి పెట్టిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇక మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా పాల్వంచగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments