Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో అనుమానాస్పదస్థితిలో తెలుగు విద్యార్థి మృతి!!

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (13:56 IST)
అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడుని తెలంగాణలోని హన్మకొండ జిల్లా బండి వంశీగా గుర్తించారు. ఈ యువకుడు నివసించే నివాసం వద్దే అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. వంశీ నివాసం ఉంటున్న అపార్టుమెంట్‌లోని కారులో శవమై కనిపించాడు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ఆదివారం నాడు సమాచారం వచ్చింది. 
 
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన గీతకార్మికుడు బండి రాజయ్య, లలిత దంపతుల రెండో కుమారుడు బండి వంశీ (25). గతేడాది జులైలో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని మిన్నెసొటాకు వెళ్లాడు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ.. ఎంఎస్ చదువుతున్నాడు.
 
ఈ క్రమంలో అతడు ఉంటున్న అపార్టుమెంట్‌లోని సెల్లార్ పార్క్ చేసి ఉన్న ఓ కారు సీట్లో మృతి చెంది ఉండడం అదే అపార్టుమెంటులో ఉంటున్న హన్మకొండ జిల్లాకే చెందిన యువకులు ఆదివారం ఉదయం గుర్తించారు. వెంటనే వంశీ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వొడితల ప్రణవ్ వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని వంశీ పేరెంట్స్కు ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనతో మాదన్నపేట గ్రామంలో విషాదం అలుముకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments