Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

Advertiesment
shivrajkumar

ఠాగూర్

, శుక్రవారం, 20 డిశెంబరు 2024 (18:18 IST)
తాను కూడా మనిషినేనని, తనకు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ అన్నారు. ఆయనకు కేన్సర్ సోకినట్టు తాజాగా వెల్లడైంది. దీంతో చికిత్స కోసం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. యూఎస్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన ఈ నెల 24వ తేదీన సర్జరీ జరుగనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆయన విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, తాను క్షేమంగానే ఉన్నానని, ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తన సహ నటులు, అలాగే అభిమానుల నుంచి పొందుతోన్న ప్రేమాభిమానం, ఆశీస్సులకు తాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు చెప్పారు. 
 
తన ఆరోగ్యం విషయంలో సంయమనం పాటించిన మీడియాకు నా ధన్యవాదాలు. అంతా మంచిగానే జరుగుతుందన్నారు. సర్జరీ కోసం ఇంటిని వదిలి వెళ్తున్నప్పుడు ఎవరికైనా కాస్త ఆందోళనగానే ఉంటుందన్నారు. కానీ సాధారణంగా నేను చాలా ధైర్యంగా ఉంటాను. అయితే ఇప్పుడు మాత్రం ఇంటి నుంచి వస్తోన్న సమయంలో నా కుటుంబసభ్యులు, అలాగే అభిమానులను చూసినప్పుడు నేను కాస్త భావోద్వేగానికి లోనైనట్టు చెప్పారు. సర్జరీ పూర్తయిన తర్వాత యూఐ, మ్యాక్స్‌ సినిమాలు చూస్తానని శివ రాజ్‌కుమార్‌ అన్నారు.
 
ఇక ట్రీట్‌మెంట్‌ తర్వాత శివ రాజ్​కుమార్ సుమారు నాలుగు వారాల పాటు అక్కడే ఉండనున్నారని సమాచారం. అయితే అమెరికా వెళ్లడానికి ముందు శివ రాజ్‌కుమార్‌ నివాసంలో ఓ పూజా కార్యక్రమం కూడా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి  కలిసి ధైర్యం కూడా చెప్పారు. గత నెలలో విడుదలైన తన సినిమా ప్రమోషన్స్‌లో శివ రాజ్‌కుమార్‌ తొలిసారి తన అనారోగ్య సమస్య గురించి మాట్లాడారు. తాను కూడా ఓ మనిషినేనని.  సమస్యలు వస్తుంటాయని చెప్పడం ఆయన ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోషన్ కనకాల చిత్రం మోగ్లీ 2025 ప్రారంభం